తెలంగాణభద్రాద్రి కొత్తగూడెంమణుగూరు

స్ట్రాంగ్ రూమ్ వద్ధ అప్రమత్తంగా విధులు నిర్వహించాలి 

స్ట్రాంగ్ రూమ్ వద్ధ అప్రమత్తంగా విధులు నిర్వహించాలి 

-పినపాక నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి

మణుగూరు, శోధన న్యూస్ : స్ట్రాంగ్ రూమ్ వద్ధ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పినపాక నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ సంబంధిత అధికారులకు సూచించారు.  శనివారం   భద్రాద్రి కొత్తగూడెం ఈవీఎం లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ నుండి బూర్గంపాడు తాసిల్దార్ ,ఈవీఎం నోడల్ ఆఫీసర్   ముజాహిద్ పీనపాక నియోజకవర్గం లో 250 పోలింగ్ స్టేషనులకు రెండు బ్యాలెట్ యూనిట్లు తప్పనిసరిగా అవసరం ఉన్నందున, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఆదేశాల మేరకు 312 బ్యాలెట్ యూనిట్లు పోలీసుల రక్షణలో మణుగూరులోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూముకు చేరవేయడం జరిగింది. ఎంపీకి పోటీ చేస్తున్న ప్రజాప్రతినిధుల సమక్షంలో బ్యాలెట్ యూనిట్లను పరిశీలించి స్ట్రాంగ్ రూంలో భద్రపరచడం జరిగిందని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి,తెలిపారు. అనంతరం ఎన్నికల వీధులలో పాల్గొంటున్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఓటర్ స్పెషలిటి కేంద్రాన్ని పరిశీలించి, ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బంది ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన అన్నారు. అనంతరం స్ట్రాంగ్ రూమును, ఓటర్ ఫెసీలిటేషన్  సెంటర్లోని రికార్డులను ఆయన పరిశీలించారు. ఈవీఎం, వివి ప్యాట్స్ భద్రపరిచిన స్ట్రాంగ్ రూమును 24 గంటలు గట్టినిగా ఏర్పాటు చేసి రక్షణ సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని ,పొరపాటున కూడా స్ట్రాంగ్ రూమ్ యొక్క వేసిన సిల్ ఎవరు తీయకుండా చూడాలని, బయటి వ్యక్తులు,రాజకీయ ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ సిబ్బంది ఎవరు ఈ పరిసరాలలో రాకుండా రక్షణ సిబ్బంది కాపలాకాయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు తహసిల్దార్ రాఘవరెడ్డి, రెవెన్యూ సిబ్బంది, రాజకీయ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *