బాధ్యతగా విధులు నిర్వహించాలి
బాధ్యతగా విధులు నిర్వహించాలి
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాచలం,శోధన న్యూస్: శ్రీరామనవమి సందర్భంగా బందోబస్తుకు విచ్చేసిన పోలీసు అధికారులు మరియు సిబ్బంది తమకు కేటాయించిన ప్రదేశాలలో బాధ్యతగా విధులు నిర్వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. శ్రీరామనవమి సందర్భంగా మన జిల్లాతో పాటు వివిధ జిల్లాల నుంచి బందోబస్తు విధులకు హాజరయ్యే సిబ్బందితో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా తమకు కేటాయించిన విధులను గురించి వారికి స్పష్టంగా వివరించడం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులకు జిల్లా ఎస్పీ కొన్ని సూచనలు చేశారు. రామనవమికి హాజరైన పోలీసు అధికారులు,సిబ్బంది తమ కేటాయించిన ప్రదేశాలలో బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు.విధుల పట్ల ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని తెలియజేశారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ సమయస్ఫూర్తితో నడుచుకోవాలని తెలియజేశారు.ట్రాఫిక్ నియంత్రణ విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ భక్తులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.