తెలంగాణరాజన్న సిరిసిల్ల

అక్రమ వడ్డీ,ఫైనాన్స్ వ్యాపారస్తులపై పోలీసుల కొరడా

 అక్రమ వడ్డీ,ఫైనాన్స్ వ్యాపారస్తులపై పోలీసుల కొరడా

-జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు

-14 కేసులు నమోదు, రూ16,13,000నగదు, 359 డాక్యుమెంట్లు స్వాధీనం

రాజన్న సిరిసిల్ల, శోధన న్యూస్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనుమతులు లేకుండా అక్రమ వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ నిర్వహిస్తున్న వారిపై శనివారం రోజున జిల్లా వ్యాప్తంగా పోలీసులు 24 టీమ్ ల గా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమ వడ్డీ వ్యాపారాం, ఫైనాన్స్ నిర్వహిస్తున్న 14 మందిపై కేసులు నమోదు చేసి రూ 16,13,000 నగదు, 359 డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా ఫైనాన్స్ నిర్వహించిన, అధిక వడ్డీలతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని వడ్డీలకు డబ్బులు ఇచ్చి వారి నుండి అధిక వడ్డీ వసూలు చేసే వ్యాపారులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని   హెచ్చరించారు. ప్రజలు తమకున్న ఉన్న అత్యవసర పరిస్థితి, తాత్కాలిక అవసరాల కోసం అధిక మొత్తంలో అవసరంకు మించి అధిక వడ్డీలకు అప్పు చేసి ఆతరువాత అప్పులు, అధిక వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడి తమ కుటుంబాలను ఇబ్బందులకు గురి చేయవద్దు అని ఎస్పీ కోరారు. ప్రభుత్వ అనుమతితో చట్టపరమైన పద్దతులలో ఫైనాన్స్ నిర్వహించే వారిని మాత్రమే నమ్మాలి అని,ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమ ఫైనాన్సు వ్యాపారం నడిపేవారి వివరాలు జిల్లా పోలీస్ కార్యాలయంలో తనకు సమాచారం ఇవ్వొచ్చు అని,అలాగే స్థానిక పోలీసు వారికి ,డయల్ 100 కు పిర్యాదు చేయాలని ఎస్పీ కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు సమగ్ర విచారణ చేసి బాధితులకు న్యాయం చేయడం లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని ఆయన తెలిపారు. అప్పు తీసుకోవడం, ఇవ్వడం నేరం కాదు కానీ ఆర్బిఐ నియమ నిబందనలు, తెలంగాణా మని లెండింగ్ చట్టంలోని నిబందనల ప్రకారం చట్ట బద్దంగా ఎవరైనా లైసెన్స్ తొ అప్పులు ఇవ్వవచ్చు, తీసుకోవచ్చు, కాని చట్ట విరుద్ధంగా, అధిక వడ్డీ రేట్లతో సామాన్యులపై దౌర్జన్యం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *