ఎండ తీవ్రతకు గురికాకుండా తగు జాగ్రత్తలు పాటించాలి
ఎండ తీవ్రతకు గురికాకుండా తగు జాగ్రత్తలు పాటించాలి
-అశ్వాపురం పిహెచ్ సి వైద్యాధికారి డాక్టర్ సంకీర్తన
అశ్వాపురం, శోధన న్యూస్ : తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయని, ఎండలు రోజురోజుకీ పెరుగుతున్న క్రమంలో ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు ఎలాంటి రక్షణ లేకుండా వెళ్లవద్దని ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ సంకీర్తన అన్నారు. ఎండలో ఎలాంటి రక్షణ లేకుండా తిరిగితే వడదెబ్బ తగులుతుందని,శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించే ఒక వ్యవస్థ సహజంగానే మన శరీరంలో ఉంటుంది. ఈ వ్యవస్థ బలహీన పడినప్పుడు ఉష్ణోగ్రత అదుపుతప్పి వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుంది అని వీలైనంతవరకు ఎండలో బయటకు వెళ్లకపోవడం చల్లని నీటిని తాగుతూ శరీరం అనేది సమతులంగా ఉంచుకోవడం వంటి సాధారణ జాగ్రత్తలతో వడదెబ్బ నుండి రక్షించుకోవచ్చని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమె పలు సూచనలు చేశారు.
నీరు, పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. రోజు కనీసం 15 గ్లాసులు నీళ్లు తాగాలి. పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, శుభ్రంగా రెండు పూటల స్నానం చేయాలని, భోజనం మితంగా చేయాలని, ఇంటి వద్దనే ఉండండి బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు టోపీ వంటి తీసుకొని వెళ్లాలని, ఇంట్లో కిటికీలు తెరిచి ఉంచాలని, ఫ్యాన్ వేసి చల్లగా ఉంచుకోవాలని సూచించారు.
-చేయకూడని పనులు..:
మండు వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రత సమయంలో ఎక్కువగా తిరగరాదు.సూర్యకిరణాలకు వేడిగాలికి గురికారాదు. రోడ్లమీద చల్లని రంగు పానీయాలు తాగరాదని, రోడ్లమీద అమ్మే కలిసిత ఆహారం తినరాదని, మాంసాహారం తగ్గించాలని, మద్యం సేవించరాదని సూచించారు. ఎండ వేళలో శరీరంపై భారం పడు శ్రమగల పనులు చేయరాడని, నల్లని దుస్తులు మందంగా ఉన్న దుస్తులు ధరించరాదని, వడదెబ్బ గురైన వ్యక్తికి చేయవలసిన ప్రధమ చికిత్స. వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడగల ప్రదేశానికి చేర్చాలన్నారు. చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం తూడవాలని, శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చేవరకు చేస్తుండాలని, ఫ్యాను గాలి లేదా చల్లని గాలి తగిలేలా ఉండాలని, ఉప్పు కలిపిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిగిన గ్లూకోస్ ద్రావణం లేదా ఓఆర్ఎస్ త్రాగించవచ్చన్నారు. వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో ఉన్న రోగికి నీరు త్రాగించకూడదన్నారు. వీలైనంత త్వరగా దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలన్నారు.