ముందస్తు అనుమతులు తప్పనిసరి
ముందస్తు అనుమతులు తప్పనిసరి
– కౌన్సిలింగ్ లో గోదావరిఖని ఏసిపి రమేష్
గోదావరిఖని, శోధన న్యూస్ : ఏదైనా కార్యక్రమానికి డీజే పెట్టాలనుకుంటే డిజే వనర్లు ముందస్తు అనుమతులను తప్పనిసరి తీసుకోవాలని గోదావరిఖని ఏసిపి రమేష్ సూచించారు. గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సబ్ డివిజన్ పరిధి లోని ఉండే డీజే ఓనర్లను, ఆపరేటర్లతో గోదావరిఖని ఏసిపి రమేష్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ రమేష్ మాట్లాడుతూ…డీజే ఓనర్లు డీజే అనుమతి తీసుకున్న రాత్రి 10 గంటల లోపు అట్టి కార్యక్రమం ముగించాలనీ అన్నారు. డీజే శబ్దాన్ని 60 నుండి 80 డిసిబుల్స్ మధ్యలో పెట్టుకోవాలన్నారు. భారీ శబ్దం పెట్టడం వలన వృద్ధులకు, చిన్నారులకు అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయనీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నారు. ,తక్కువ శబ్దం పెట్టి కార్యక్రమం నిర్వహించుకొని ప్రశాంతంగా ముగించుకోవాలనీ కోరారు. డీజే ఓనర్లు, ఆపరేటర్లు ఇష్టానుసారం చేస్తే డీజే లు సీజ్ చేయడం కాకుండా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఏసిపి రమేష్ హెచ్చరించారు.