ప్రైవేట్ స్కూళ్ల ఆగడాలను అరికట్టాలి.!
ప్రైవేట్ స్కూళ్ల ఆగడాలను అరికట్టాలి.!
-అధిక ఫీజు వసూళ్లను కట్టడి చేయాలి
– అనుమతులు లేని విద్యాసంస్థలను నిలిపివేయాలి
– విద్యార్థుల పట్ల వేధింపులకు పాల్పడిన ప్రైవేట్ విద్య సంస్థలను మూసి వేయాలి
– మణుగూరు జేఏసీ నాయకుల డిమాండ్
మణుగూరు, శోధన న్యూస్ :
ప్రైవేట్ స్కూళ్ల లో అధిక ఫీజు వసూళ్లను కట్టడి చేయాలని, అనుమతులు లేని విద్యాసంస్థలను నిలిపివేయాలని, విద్యార్థుల పట్ల వేధింపులకు పాల్పడిన ప్రైవేట్ విద్య సంస్థలను మూసి వేయాలని మణుగూరు జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. విద్యాసంస్థలపై తగిన చర్యలు తీసుకుని అత్యధిక ఫీజులు వసూలను కట్టడి చేసి, విద్యార్థులకు విద్యాసంస్థలు నాణ్యమైన బోధన, నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించేలా స్థానిక తహశీల్దార్, నిరంతర పర్యవేక్షణ చేయగలరని మణుగూరు జేఏసీ కోరారు. ఏజెన్సీ ప్రాంతంలో విద్యా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలు, విద్యాహక్కు చట్టం, నిబంధనల ప్రకారము ఉచితంగా విద్యను అందించే కోటాలో, ఏజెన్సీ ప్రాంతంలో గల ప్రైవేట్ విద్యాసంస్థలలో విద్యను గిరిజనుల కు పూర్తి గా ఉచితంగా అందించాలని ఉన్నప్పటికీ, ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో సదరు విద్యాసంస్థలు విఫలం అయినాయి. కావున ఇప్పటికైనా నిరుపేద గిరిజనులకు విద్యా హక్కు చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో 100% ప్రవేశాలు కల్పించేలా తగిన చర్యలు తీసుకుని విద్యా హక్కు చట్టం ప్రతిష్టంగా అమలు చేస్తూ, అత్యధిక ఫీజులు వసువులను కట్టడి చేయగలరని స్థానిక తహశీల్దార్ కు మణుగూరు జేఏసీ నాయకులు వినతిపత్రం అందించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎంపిడిఓ ను కలిసి, మండలంలోని ప్రతి గ్రామ పంచాయితీలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పెసా గ్రామసభ అనుమతి తప్పనిసరిగా స్వీకరించాలని, పంచాయితీ లోని పలు గ్రామాభివృద్ధి లో భాగంగా పెసా చట్టాన్ని అమలు చేస్తూ.. ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రజాప్రతినిధులతో పాటు స్థానిక పెసా కమిటీలను ఆహ్వానిస్తూ.. భాగస్వాములను చెయ్యాలని, గ్రామాల్లోని 1/70 చట్టానికి విరుద్ధంగా, పలు భూ బదలాయింపులు, రియల్ ఎస్టేట్ మాఫియా, బహుళ అంతస్తులకు, కబ్జా చేసిన ప్రభుత్వ భూములకు, విచ్చలవిడిగా ఇంటి పన్నులు.. కరెంట్ మీటర్లు.. ఇస్తూ, పలు వెంచర్లకు సహకరిస్తూ.. ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా అనుమతులు ఇస్తున్నారని. ఇట్టి అక్రమాలపై ఎటువంటి అనుమతులు ఇవ్వకూడదని, అలా ఇస్తూ .. అధికార దుర్వినియోగం చేపడితే, భారీ ఎత్తున ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడి చేస్తామని, సంబంధిత అధికారులను జేఏసీ కమిటీ హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా.. సంబంధిత అధికారు, ఎంపిడిఓ, ఎమ్మార్వో సానుకూలంగా స్పందించి, పూర్తి స్థాయిలో సహకరిస్తామని, చట్టాలను గౌరవిస్తూ.. పకడ్బందీగా అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో.. మణుగూరు జేఏసీ అధ్యక్షుడు సోడె రవి కుమార్ దొర, ఉపాధ్యక్షులు పూనెం రమేష్, ఇర్ప రవి కుమార్ దొర, గనిబోయిన ముత్తయ్య, జేఏసీ కార్యదర్శి పూనెం నాగరాజు, ఆదివాసీ సేన రాష్ట్ర నాయకులు వజ్జ జ్యోతి బసు, కృష్ణ, నరేష్, కోడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.