వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సత్వర చర్యలు చేపట్టాలి
వేసవిలో నీటి ఎద్దడి నివారణకు సత్వర చర్యలు చేపట్టాలి
-చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి
-హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
వరంగల్ ,శోధన న్యూస్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలోని ప్రాంతాలు, జిల్లాలోని గ్రామాల్లో తాగునీటి సరఫరా, నిర్వహణపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా, మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా తాగునీటి సరఫరా, నిర్వహణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాల్లో తాగునీటి సక్రమంగా జరుగుతుందా, ఎక్కడైనా తాగునీటి సమస్యలు ఉన్నాయా, సమస్యలకు ఎలాంటి ఏర్పాట్లు, ఇబ్బందులు లేకుండా ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు, తాగునీటి సమస్యలపై ప్రజల ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు, అధికారుల పర్యవేక్షణ, తదితర వివరాలపై కలెక్టర్ సిక్తా పట్నాయక్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ, అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా, అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ వేసవిలో ఎక్కడ కూడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు సత్వర చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి సమస్యల పై అధికారులు, సిబ్బంది నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. వేసవి కాలం దృష్ట్యా తాగునీటికి సంబంధించి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని, తాగునీటి సరఫరా లో ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. వేసవి కాలం దృష్ట్యా ప్రజలు వడగాడ్పుల భారిన పడకుండా ఉండేందుకు షేడ్ నెట్లను ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు.