మెరుగైన వైద్య సేవలు అందించాలి -భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అల
మెరుగైన వైద్య సేవలు అందించాలి
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అల
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అల సూచించారు. శుక్రవారం కొత్తగూడెం జిల్లా కేంద్ర ఆసుపత్రిని ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలో కలియ తిరుగుతూ వార్డులు పరిశీలించి రోగులతో మాట్లాడారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రియాంక అల మాట్లాడుతూ ప్రభుత్వ వెద్యశాలలకు వచ్చే రోగులకు వైద్యులు అందుబాటులో ఉంటూ సేవలను అందించాలని, ప్రజలు ప్రభుత్వ వెద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆసుపత్రి పర్యావేక్షకులు , వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.