మెరుగైన వైద్య సేవలు అందించాలి
మెరుగైన వైద్య సేవలు అందించాలి
ములుగు,శోధన న్యూస్: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి వైద్య సిబ్బంది కృషి చేయాలని, వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులకు హాజరు కావాలని ములుగు జిల్లా అదనపు కలెక్టర్ పి శ్రీజ అన్నారు. వాజేడు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని, ప్రస్తుతం వేసవి కాలంలో వడదెబ్బకు గురైన వ్యక్తులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని సూచించారు.ప్రసూతి గదిని అందులో అత్యవసర మందుల నిలువలను లభ్యంగా ఉన్నాయా పరిశీలించారు. అనంతరం మహిళ వార్డును సందర్శిచి రోగులు పొందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. తదుపరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాస్ కాపీ జరుగకుండా జాగ్రతలు తీసుకోవాలని, విద్యార్థులకు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇతర సౌకర్యాలు, నిరంతరం విద్యుత్ సరఫరాలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆన్ని ఏర్పాటు చేయాలన్నారు.