తెలంగాణభద్రాద్రి కొత్తగూడెంమణుగూరు

నిరంతరం వైద్య సేవలు అందించాలి

నిరంతరం వైద్య సేవలు అందించాలి

 -పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 

మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి లో నిరంతరం వైద్య సేవలు అందించాలని పినపాక ఎమ్మేల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం మణుగూరు 100 పడకల ఆస్పత్రిని సందర్శించి  వైద్యులతో మాట్లాడి రోగులకు అందుతున్న వైద్యంపై అడిగి తెలుసుకున్నారు. డయాలసిస్ కేంద్రంతో పాటు జనరల్ వార్డులను పరిశీలించి వారికి అందుతున్న సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్పిటల్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రధాన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డయాలసిస్ అందుతున్న తీరు ప్రసవాల సంఖ్య వివరాలతో పాటు శానిటేషన్ నిర్వహణ తీరును, మందుల లభ్యతను అడిగి తెలుసుకున్నారు. పినపాక నియోజకవర్గానికి కేంద్రంగా ఉన్న మణుగూరు ఏరియా 100 పడకల ఆస్పత్రిలో నిరంతర వైద్య సేవలందించాలని, అత్యవసరమైతేనే భద్రాచలం,లేదా కొత్తగూడెం ప్రధాన ఆసుపత్రులకు రిఫర్ చేయాలి తప్ప చిన్న చిన్న వాటికి రిఫర్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని ఎమ్మెల్యే  పాయం అన్నారు.

ఆస్పత్రి పేషెంట్ కేర్ సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సిబ్బందిని ఇష్టానుసారంగా నియమాకం చేయడం వల్ల ఇబ్బంది పడుతుండటంతో పాటు 75 బెడ్లకు సంబంధించి మాత్రమే సౌకర్యాలు మంజూరవుతుండటం గ్రాంట్లు రాకపోవడం వల్ల పడుతున్న ఇబ్బందులు వివరించి ఆక్సీజన్ ప్లాంట్ మరమ్మతులకు గురైందని వివరించగా, వెంటనే నివేదిక అందించాలని వానకాలం దృష్టా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని అందుకోసం అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  దృష్టికి తీసుకెళ్లి 100 పడకల ఆస్పత్రికి సిబ్బంది కొరతతో పాటు సమస్యలు పరిష్కరిస్తానన్నారు. స్టాఫ్ నర్సులు వైద్యానికి వచ్చే రోగులతో స్నేహభావంతో మెలగాలని సూచించారు.

20 మంది మాత్రమే స్టాఫ్ నర్స్ సిబ్బంది ఉండటంతో ఇబ్బందులెదురవుతున్నాయని స్టాఫ్ నర్సులు ఎమ్మెల్యేకీ విన్నవించారు.  సమావేశ మందిరం, ఆర్ ఓ ప్లాంట్, ప్రత్యామ్నయ ట్రాన్స్ ఫార్మర్, గదుల కొరత 2022 జీవో వచ్చిన రాని సామగ్రి వివరాలు రాకపోవడం పై వివరాలు తీసుకున్నారు. అదే విధంగా ఆసుపత్రి పరిసర ప్రాంతాలను పరిశీలించి తగు జాగ్రత్తలు సూచనలు ఆసుపత్రి సిబ్బందికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీల్, హాస్పిటల్ సిబ్బంది,ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *