విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలి
విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలి
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. విద్యాశాఖ శిక్షణ మందిరం, పాత కొత్తగూడెంలో జరిగిన జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమీక్షా సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలకు విలువలతో కూడిన విద్యను అందించటం, తద్వారా విద్యార్థులను సమర్థవంతమైన పౌరులుగా తీర్చిదిద్దడం గురువుల బాధ్యత అని తెలియజేశారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులలో భేషజాలకు పోకుండా తక్కువ ఖర్చుతో పిల్లలకు సకల సదుపాయాలను ఎలా కలుగజేయవచ్చో ఉదాహరణతో సహా వివరించారు. అదేవిధంగా వనమహోత్సవంలో భాగంగా పాఠశాలల్లో తప్పనిసరిగా చింత, ఉసిరి, వెలగ, కరివేపాకు, మునగ మొక్కలను తప్పనిసరిగా నాటాలని అదేవిధంగా వివిధ పూల మొక్కలతో ఫ్లవర్ బెడ్స్ తయారు చేయాలని సూచించారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం కోసం వర్క్ షీట్స్ అందించనున్నట్లుగా తెలిపారు. ఈ వర్క్ షీట్స్ ని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పిల్లలచే సమర్థవంతంగా వినియోగింప చేసి పిల్లలలో విద్యా ప్రమాణాల పెంపుతూ కృషి చేయాలని తద్వారా జిల్లాను విద్యాపరంగా ఉన్నత స్థానంలో నిలపాలని తెలిపారు.
సమావేశంలో జిల్లా ఎడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ విద్యాచందన మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన పనులలో గొప్ప పురోగతి సాధించామని, ఇదే స్ఫూర్తితో మిగిలిన పాఠశాలల్లో కూడా పనులను పూర్తిచేయాలని ఇప్పటికే పూర్తయిన పనులకు సంబంధించిన ఆయా పాఠశాల కమిటీలకు అందజేశామని తెలిపారు. వనమహోత్సవంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి సూచనలు మేరకు అన్ని పాఠశాలల్లో మొక్కలు నాటాలని తెలియజేశారు. పిల్లలకు ఏకరూప దుస్తులను సకాలంలో అందజేయడానికి సహకరించిన ప్రధానోపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో సాంకేతిక పరమైన సమస్యలకు వాటికి సంబంధించిన అంశాలను జిల్లా రహదారులు,భవనాల శాఖ ఈఈ వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర చారి, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ నాగరాజశేఖర్, కమ్యూనిటీ మొదలైజేషన్ అధికారి ఎస్కే సైదులు, ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎన్ సతీష్ కుమార్, బాలిక విద్య కోఆర్డినేటర్ కే అన్నామని, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఎస్ మాధవరావు, సమగ్ర శిక్ష ఫైనాన్స్ ఆఫీసర్ ఎస్ శ్రీనివాస్ రావు, జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు, మండల నోడల్ అధికారులు పాల్గొన్నారు.