తెలంగాణమధిర

రైల్వే స్టేషన్ పరిశీలించిన ఎడిఆర్ఎం

మధిర రైల్వే స్టేషన్ పరిశీలించిన రైల్వే ఎడిఆర్ఎం

మధిర , శోధన న్యూస్ : అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం కింద ఎంపికైన మధిర రైల్వే స్టేషన్ ను దక్షిణ మధ్య రైల్వే ఎడిఆర్ఎం గోపాల్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైల్వే ఉన్నతాధికారులు మధిర రైల్వే స్టేషన్ ను అభివృద్ధి పరిచేందుకు నూతనంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను చూపించి ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపడుతున్నామనే విషయాలను ఎడిఆర్ఎంకు వివరించారు. ఈ సందర్భంగా ఎడిఆర్ఎం రైల్వే స్టేషన్ ను పూర్తిగా పరిశీలించారు. ప్లాట్ ఫార్మ్ ల  వైపు రూపొందించిన ప్రణాళిక  ప్రకారం జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి నిర్మాణ వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు, మధిర రైల్వే సిబ్బంది తదితరులు ఉన్నారు. మధిర రైల్వే స్టేషన్ లో పలు రైళ్లను నిలపాలని కోరుతూ బిజెపి మధిర నియోజకవర్గ కన్వీనర్ ఏలూరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నాయకులు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు చిలువేరు సాంబశివరావు పాపట్ల రమేష్,గుండా చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *