యుద్ధ ప్రాతిపదికన వర్ష నష్ట నివారణ చర్యలు చేపట్టాలి
యుద్ధ ప్రాతిపదికన వర్ష నష్ట నివారణ చర్యలు చేపట్టాలి
-కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం కురిసిన వడగండ్ల వాన, భారీ ఈదురుగాలులతో తీవ్రంగా నష్టం వాటిల్లిందని, తక్షణమే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి యుద్ధ ప్రాతిపదికన నష్ట నివారణ చర్యలు చేపట్టాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టరుకు, విద్యుత్ శాఖ జిల్లా అధికారులకు ఫోన్ చేసి తగు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ భారీగా కురిసిన వడగండ్ల వాన, ఈదురుగాలతో పేదల ఇండ్లు, గుడిసెలు నేలమట్టం అయ్యాయని, విద్యుత్ స్తంభాలు నేలకొరిగి అనేక గ్రామాలు, పట్టణాల్లోని బస్తీలు అంధకారంలోకి నెట్టు వేయబడ్డాయని, తక్షణమే విద్యుత్ పునరుద్ధ పునరుద్ధరణ పనులు చేపట్టాలని కోరారు. ఇల్లు కోల్పోయిన పేదలకు తక్షణపరిహారం అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని, పూర్తిగా ఇల్లు కోల్పోయిన వారికి ప్రభుత్వ గృహ పథకం మంజూరు చేయించాలని కోరారు. మామిడి, మిర్చి ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులతో సర్వే చేపట్టి నష్టాన్ని అంచనా వేయడం ద్వారా ప్రభుత్వ నుంచి పరిహారం అందేలా చర్య తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులను కూనంనేని కోరారు.