అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి
మణుగూరు, శోధన న్యూస్ : అన్నాచెల్లెళ్లు, అక్కా తముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా జిఎం దుర్గం రామచందర్ అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సింగరేణి ఎంప్లాయిస్ వైవ్స్ అసోసియేషన్ (SEWA) సేవా ఆధ్వర్యంలో సోమవారం ఏరియా జిఎం దుర్గం రాంచందర్ కి, ఇన్ ఛార్జ్ ఎస్ఓటు జిఎం పి వీరభద్రరావు కి, ఏజీఎం సివిల్ ధనసరి వెంకటేశ్వర్లు కి, ఏరియా ఇంజనీర్ ఆర్ శ్రీనివాస్కి , అధికార ప్రతినిధి ఎస్ రమేష్ కి, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రామారావుకి, బదిలీ అధికారి జెవి రమణకి, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ షబ్బీరుద్దీన్ కి, పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారులు సింగ్ శ్రీనివాస్, రామేశ్వర్, పిఏ రాంబాబు, గుర్తింపు సంఘం నాయకులు వై రామ్ గోపాల్, ప్రాతినిధ్య సంఘం నాయకులు వత్సవాయి కృష్ణంరాజు తదితరులకు రాఖీలు కట్టి స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా సేవా కార్యదర్శి షేక్ షాకీరా బేగం, యస్ డి జమేలా బేగం, పులి శెట్టి సంధ్య, రాయుడు సత్యవతి, ఎం సత్యవతి, ఎస్ కుమారి తదితరులు పాల్గొన్నారు.