తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

రికవరీ చేసిన  మొబైల్ ఫోన్లను బాధితులకు అందిస్తాం 

రికవరీ చేసిన  మొబైల్ ఫోన్లను బాధితులకు అందిస్తాం 

-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో  పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సిఇఐఆర్  పోర్టల్ ద్వారా రికవరీ చేసి  తిరిగి భాదితులకు అందజేస్తామని భద్రాద్రి కొత్తగూడెం  జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుండి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సిఇఐఆర్ పోర్టల్ ద్వారా మొత్తం 1674 ఫిర్యాదులను అందుకోవడం జరిగింది.ఇందులో 964 మొబైల్స్ ను కనిపెట్టడం జరింగిందన్నారు.కనిపెట్టిన వాటిలో ఇప్పటివరకు 483 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించడం జరిగిందన్నారు.మొబైల్ పోగొట్టుకున్న బాధితులు వెంటనే  సిఇఐఆర్  పోర్టల్ లో ఆన్లైన్ ద్వారా అడిగిన అన్ని రకాల వివరాలను కచ్చితంగా నమోదు చేసుకుంటే సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి తిరిగి వారి మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి కనిపెట్టడం జరుగుతుందని తెలిపారు. కావున ఎవరైనా తమ మొబైల్ దొంగిలించబడిన పోగొట్టుకున్న వెంటనే సిఇఐఆర్  పోర్టల్ ద్వారా తిరిగి వారి మొబైల్ ఫోన్ లను పొందవచ్చునని తెలిపారు. జిల్లాలో కొత్తగూడెం త్రీ టౌన్, మణుగూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ విదానం ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను కనిపెట్టి బాధితులకు అందజేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో అధికంగా మొబైల్ ఫోన్లను కనిపెట్టి బాధితులకు తిరిగి అందజేసే విదంగా కృషి చేసిన కానిస్టేబుల్   విష్ణువర్ధన్ ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం లో ఎస్ బి ఇన్స్పెక్టర్ నాగరాజు, ఐటి సెల్ ఇంచార్జ్ సిఐ నాగరాజు రెడ్డి, ఐటి సెల్ సభ్యులు విజయ్, రజెష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *