తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

వేతనాలు పెంచాలని సిఎం రేవంత్ రెడ్డికి వినతి

వేతనాలు పెంచాలని సిఎం రేవంత్ రెడ్డికి వినతి

ఇల్లందు, శోధన న్యూస్ : కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని సిఎం రేవంత్ రెడ్డికి ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ యాకూబ్ షావలి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులకు చాలీచాలని వేతనాలతో అరకొర సౌకర్యాలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తమ జీతాలు పెరుగుతాయని, వారి  బతుకులు బాగుపడతాయని అన్నారు.  కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తారని ఆశించిన సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు బిఆర్ఎస్ ప్రభుత్వం మొండి చేయి చూపింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నైనా సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను గుర్తించాలని ఇఫ్టూ నాయకులు కోరారు. గత 18 రోజుల సమ్మెలో పాల్గొని నష్టపోయిన కాంట్రాక్టు కార్మికులు తీవ్ర నిరాశా నిస్పృహలో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలను గుర్తించాలని, వారికి వేతనాల పెంపు చేయాలని, కోల్ ఇండియాలో అమలు జరుగుతున్న వేతనాలను ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డికి సమర్పించిన వినతిపత్రంలో కోరారు.  సమస్యల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *