సీఎంపిఎఫ్ జమ వివరాలు అందజేయాలని వినతి
సీఎంపిఎఫ్ జమ వివరాలు అందజేయాలని వినతి
పినపాక నియోజకవర్గం ప్రతినిధి , ఏప్రిల్ 10, శోధన న్యూస్ :
సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సీఎం పిఎఫ్ జమ వివరాలు అందజేయాలనీ కోరుతూ శుక్రవారం ఇఫ్టూ ఆధ్వర్యంలో పినపాక నియోజక వర్గం సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా డీజిఎం సివిల్ శివప్రసాద్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏరియా అధ్యక్షుడు మంగీలాల్ మాట్లాడుతూ మణుగూరు ఏరియా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సీఎం పిఎఫ్ వివరాలకు సంబంధించి ఈ సంవత్సరం మార్చి నెలాఖరు వరకు నాలుగు సంవత్సరాల వివరాలు చిట్టీలు కాంట్రాక్టు వర్కర్లకు అందజేయాల్సి ఉండగా.. పిఎఫ్ లెక్కలు చూపటంలో జాప్యం జరిగిందన్నారు. వెంటనే ఈ సంవత్సరం మార్చి నెలాఖరు వరకు అన్ని విభాగాలు,ఉద్యానవనాలు, ప్రైవేట్ సెక్యూరిటీ, ప్రైవేటు వాహన డ్రైవర్లకు సంబంధించి సీఎం పిఎఫ్ జమ వివరాల చిట్టీలు అందజేయాలని కోరారు, అలాగే పర్మినెంట్ ఉద్యోగుల వలె కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పిఎఫ్ ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంటాక్ట్ కార్మికులు కురం నాగేశ్వరరావు, ఉప్పల శివరామకృష్ణ, ఎం సాంబయ్య, ఎం గురు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


