తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

సీసీ రోడ్ల నిర్మాణాని కి రూ.10  కోట్ల  నిధులు మంజూరు -పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

సీసీ రోడ్ల నిర్మాణాని కి రూ.10  కోట్ల  నిధులు మంజూరు

-పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో సీసీ రోడ్ల నిర్మాణానికి పది కోట్ల రూపాయల స్పెషల్ గ్రాంట్ నిధులు మంజూరు అయినట్లు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం  తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి వినతిపత్రం అందజేయగా.. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో సీసీ రోడ్ల నిర్మాణానికి అభివృద్ధికి పది కోట్ల రూపాయలను  స్పెషల్ గ్రాంట్ క్రింద నిధులను వెంటనే మంజూరు చేశారని తెలిపారు. ఈ నిధులతో పినపాక నియోజకవర్గంలోని అన్ని గ్రామలలో సీసీ రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైన్ ల నిర్మాణం, కల్వర్టుల నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు. ఇప్పటికే అన్ని మండలాల ఎంపిడిఓ లు, ఎంపీవో లతో సమీక్షా సమావేశం నిర్వహించామని, ఈ సమావేశంలో అధికారులు ఇచ్చిన నివేదికల ప్రకారం అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని స్పెషల్ గ్రాంట్ నిధులు మంజూరు చేయించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన  తెలిపారు. అడిగిన వెంటనే స్పెషల్ గ్రాంట్ నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *