రూ.2లక్షల 93వేల నగదు సీజ్
రూ.2లక్షల 93వేల నగదు సీజ్
హైదరాబాద్, శోధన న్యూస్ : పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో తాండూరు మండలంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో కరణ్ కోట్ పోలీస్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో సీసీఐ కాలానికి చెందిన మహమ్మద్ అనాజ్ అనే వ్యక్తి స్కూటీపై వెళ్తుండగా సోదాలు నిర్వహించగా అతని వద్ద రూ.2లక్షల 93వేల 830 నగదును గుర్తించారు. ఇట్టి నగదుకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కరణ్ కోట్ పోలీసులు సీజ్ చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ట్రెజరీ కి తరలించినట్లు ఎస్ఐ విట్టల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా రూ.50వేలకు నుంచి నగదును తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.