తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

తలసేమియా బాధితుని వైద్య ఖర్చులకు రూ.50వేల సహాయం

తలసేమియా బాధితుని వైద్య ఖర్చులకు రూ.50వేలు  సహాయం

మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో తలసేమియా బాధితుడి వైద్యఖర్చులకు భరోసా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఏరియా జీఎం దుర్గం రామచందర్ చేతుల వి దుగా రూ.50వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మండలానికి చెందిన కుంచాల సుధారాణి-వెంకటేశ్వర్లు దంపతుల కుమారుడు షణ్ముఖ అనే బాలుడు తల సేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ బాలునికి శస్త్ర చికిత్సకు రూ.14 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో ఆ నిరు పేద కుటుంబం దిక్కుతోచని స్థితిలో మణుగూరు ఏరియా భరోసా వెల్ఫేర్ సొసైటీని ఆశ్రయించింది. వెంటనే స్పందించిన భరోసా  సొసైటీ సభ్యులు తమ భాగస్వామ్యంతో పాటు దాతల నుండి సేకరించిన రూ. 50వేలను చెక్కు రూపంలో బాధితుని కుటుంబ సభ్యులకు జీఎం రామచందర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జీఎం  మాట్లాడుతూ భరోసా వెల్ఫేర్ సొసైటీ చేస్తున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. శస్త్ర కిత్స విజయవంతమై బాలుడు షణ్ముఖ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్వోటు జీఎం వీసం కృష్ణయ్య, పీకే ఓసి ప్రాజెక్ట్ అధికారి తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్, ఏరియా ఇంజనీర్ ఎం నర్సిరెడ్డి, ఏజిఎం సివిల్ ధనసిరి వేంకటేశ్వర్లు, డీజీఎం(పర్సనల్) ఎస్ రమేష్, సీనియర్ పీవో ఎండి మదార్ సాహెబ్, శ్రీనివాసమూర్తి, పరుణ్, భరత్ షబ్బీర్, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ షబ్బీర్ అలీ, సర్వర్ నబి, సొసైటీ అధ్యక్షులు ఎం లింగబాబు, సభ్యులు ఎండి అమీనుద్దీన్, ఉపేందర్, దశరథ్, బి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *