సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం
సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం.
సంగారెడ్డి జిల్లా శోధన న్యూస్ :ఇండస్ట్రియల్ పార్క్ సుల్తాన్ పూర్ లో వివిధ కంపెనీలకు చెందిన పారిశ్రామిక వేత్తలు ఏర్పాటు చేసిన మొదటి “సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్” సమావేశానికి ముఖ్య అతిధిగా జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ హజరైయ్యారు.వైబ్రేట్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, సుల్తాన్ పూర్ లో వివిధ కంపెనీలకు చెందిన పారిశ్రామిక వేత్తలు ఏర్పాటు చేసిన మొదటి “సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్” సమావేశానికి జిల్లా ఎస్పీ హజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సొసైటీ స్థాపనకు గల ముఖ్య కారణాలను వివరిస్తూ పరిశ్రమలలో తరచు చోటు చేసుకుంటున్నా వివిధ రకాల ప్రమాదాలు, పరిశ్రమలలో ఉండవలసిన భద్రతపరమైన చర్యలను గురించి చర్చించారు. అదేవిధంగా పరిశ్రమలలో పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగులకు కావలసిన రక్షణ గురించి జిల్లాలో నిరుద్యోగ యువతకు అందించవలసిన ఎంప్లాయిమెంట్ గురించి చర్చించారు. అన్ని పరిశ్రమలకు సంబంధించిన యాజమాన్యాలు ఒక సోసైటీ గా ఏర్పడి సంగారెడ్డి జిల్లాలో గల పరిశ్రమల రక్షణ, మహిళల భద్రత, రవాణా, ట్రాఫిక్ రద్దీ నిర్వహణ, ఫైర్ సేఫ్టీ, ఇండస్ట్రీస్ సెక్యూరిటి, సైబర్ నేరాలు తదితర సమస్యల నివారణకు కృషి చేయడం జరుగుతుందన్నారు.నిరుద్యోగయువత పెరిగిపోతున్న తరుణంలో ఈ సమస్యను అదిగమించాలంటే పారిశ్రామిక వేత్తలు జిల్లాలో పెట్టుబడులు పెట్టి, కొత్త పరిశ్రమలు స్థాపించడం ద్వారా మాత్రమే ఈ సమస్యను అదిగమించవచ్చు అన్నారు. ఏ పారిశ్రామికవేత్తలైన జిల్లాలో పెట్టుబడులు పెట్టాలంటే వారి పెట్టుబడులకు మన జిల్లాలో సరైన భద్రత, రక్షణ ఉందనే నమ్మకాన్ని వారిలో కలిగించినప్పుడే సాధ్యమౌతుందరు.