అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం
అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం
కారేపల్లి, శోధన న్యూస్ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం రాత్రి శివపార్వతుల కళ్యాణ వేడుకలను మండలంలో ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని గేటు కారేపల్లి,కారేపల్లి, కోటిలింగాల,పేరుపల్లి, లింగం బంజారా గ్రామాలలో శివపార్వతుల కళ్యాణ వేడుకలను కన్నుల పండుగగా భక్తుల ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. గేట్ కారేపల్లి శివాలయంలో నిర్వహించిన స్వామివార్ల కళ్యాణ వేడుకలలో మహిళలు వేసిన కోలాటంఆకర్షణగా నిలిచింది.శివ ఆరవతల కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. గేట్ కారేపల్లి ఆలయంలో ఆలయ ఈవో కె. వేణుగోపాలచార్యులు, ట్రస్టీ ఫౌండర్ పర్సా పట్టాభి రామారావు,ఆలయ ధర్మకర్త పరస శరత్ కుమార్ ల ఆధ్వర్యంలో కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ సాంప్రదాయం ప్రకారం మొదట గ్రామంలోని ఆంజనేయస్వామి గుడి వద్ద కళ్యాణపు దేవతామూర్తుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మేళ తాళాలతో మహిళా కోలాట బృందం సందడితో దేవతామూర్తులను ఊరేగింపుగా మోసుకొని శివాలయంకు చేరుకున్నారు.అనంతరం గేటుకారేపల్లికి చెందిన హైకోర్టు న్యాయవాది పరసా అనంత నాగేశ్వరరావు లక్ష్మీప్రసన్న దంపతులు,ఆలయ ధర్మకర్త పరస సనత్ కుమార్ శ్రీదేవి దంపతులతో ఆలయ అర్చకులు సురేష్ శర్మ కళ్యాణపు క్రతువును నిర్వహించారు.అనంతరం భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలను అందజేశారు.