ఈవీఎం కనెక్షన్పై అవగాహన ఉండాలి
ఈవీఎం కనెక్షన్పై అవగాహన ఉండాలి
-భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: ఈవీఎం కనెక్షన్పై అవగాహన కలిగి ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా సూచించారు. పాల్వంచ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు భద్రాచలం నియోజకవర్గ ఎన్నికల సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా ఆకస్మికంగా పరిశీలించారు. శిక్షణ తరగతులలో ఈవీఎం పరికరాల పనితీరును పీఓ,ఏపీఓ లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎన్నికల సిబ్బందికి డెమో కార్యక్రమంనిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల పోలింగ్ సమయంలో ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా పోలింగ్ రోజున పూరించాల్సిన 17సీ, పీవో డైరీ, పీవో రిపోర్టులతో పాటు ఈవీఎం కనెక్షన్ మీద స్పష్టమైన అవగాహన ఉండాలని పేర్కొన్నారు.ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా ఎన్నికల సిబ్బంది వ్యవహరించాలన్నారు.ఈ రోజున నిర్వహిస్తున్న మొదటి శిక్షణా కార్యక్రమానికి కొత్తగూడెం నకు 275 మంది, అశ్వారావుపేటకు 264 మంది, ఇల్లందునకు 225 మంది, పినపాకకు 260 మంది భద్రాచలంనకు 209 మంది మొత్తం 1233 మందికి గాను 48 మంది గై హాజరు అయినారు వారికీ షాకాజ్ నోటీసులు జరిచేయావల్సింది గా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.