ఈవీఎంలపై అవగాహన ఉండాలి
ఈవీఎంలపై అవగాహన ఉండాలి
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి ప్రియాంక అలా
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : ఈవీఎంలపై అవగాహన ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా తెలిపారు. సోమవారం ఆమె కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయం లో ఉన్న ఈవీఎం గోడౌను పరిశీలించారు. ఎన్నికల సిబ్బంది శిక్షణలో భాగంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు ఈవీఎంలు, వివి ప్యాడ్స్ ను కేటాయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలలో విధులు నిర్వహించే ప్రిసెండింగ్ అధికారులు, సహాయ ప్రిసెండింగ్ అధికారులు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల(ఈవీఎం)పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సిబ్బంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్ల గురించి తెలుసుకోవాలన్నారు. ఎన్నికల సిబ్బంది పోలింగ్, కౌంటింగ్ వంటి ఎన్నికల ప్రక్రియపై అవగాహన కలిగి, శిక్షణ సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పూర్తిగా అర్థం చేసుకోవాలన్నారు. ఎన్నికల విధుల్లో పొరపాట్లు జరిగితే చర్యలు తీవ్రస్థాయిలో ఉంటాయన్నారు. ఈవీఏంలు, వీవీప్యాట్‌లపై సిబ్బందికి పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఏదేని సమస్య తలెత్తిన యెడల తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి అవగాహన అవసరం అని కలెక్టర్ తెలిపారు.