ఇంటర్ ఫలితాల్లో సిద్దార్ధ్ ఒకేషనల్ విద్యార్దుల ప్రభంజనం
ఇంటర్ ఫలితాల్లో సిద్దార్ధ్ ఒకేషనల్ విద్యార్దుల ప్రభంజనం
మణుగూరు, శోధన న్యూస్ : తెలంగాణా రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం విడుదల చేసిన ఫలితాలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని సిద్దార్ధ్ ఒకేషనల్ విద్యార్దులు ప్రభంజనం సృష్టించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎంపిహెచ్ డబ్ల్యూ(ఎఫ్) విభాగంలో 500 మార్కులకు గానూ కొలువుల రచన 487, ఎలక స్వీటీ 483, కుర్సం గౌరీ 476 మార్కులు, ఎంఎల్ టి విభాగంలో గడదాసు సాయిశ్రీ 474, మహంకాళి మానస 4680, సింగిరెడ్డి వసుధ 438 మార్కులు, ద్వితీయ సంవత్సరంలో ఎంపిహెచ్ డబ్ల్యూ(ఎఫ్)లో 1000 మార్కులకు గానూ వంక నవ్య శ్రీ 929 , జనగం దివ్య శ్రీ 920 , రుక్సానా 904 మార్కులు, ఎంఎల్ టి విభాగములో జి కార్తీక్ కుమార్ 959 , ఎండి ఇస్రత్ 917 , భాగి వసుధ 906 మార్కులతో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయిలో అతున్నత మార్కులు సాధించి విజయ ఢంకా మ్రోగించారు. ఏ మరియు బి గ్రేడ్ లలో మరెందరో విద్యార్థినీ విద్యార్థులు మార్కుల మ్రోత మ్రోగించారు. ఈ సందర్భముగా కళాశాల ప్రిన్సిపాల్ వల్లభనేని అజయ్ కుమార్ ఈ విజయానికి విద్యార్థుల కృషి , అధ్యాపక బృందం యొక్క అంకితభావం గొప్పదని కొనియాడారు. విద్యార్థినీ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమములో కళాశాల సిబ్బంది, మమత, కల్పన, స్వాతి,ఉషశ్రీ, వెంకటేశ్వరరావు, సతీష్ పాల్గొన్నారు.