ఆంగ్ల ప్రయోగశాల ను ప్రారంభించిన సింగరేణి సిఅండ్ఎండి
ఆంగ్ల ప్రయోగశాల ను ప్రారంభించిన సింగరేణి సిఅండ్ఎండి
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి మహిళా కళాశాలలో నూతనముగా ఏర్పాటు చేసిన ఆంగ్ల ప్రయోగశాల ను సింగరేణి ఛైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ ఎన్ బలరాం ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగరేణి ఛైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ ఎన్ బలరాం మాట్లాడుతూ ఈ నూతన ఆంగ్ల ప్రయోగశాల ద్వారా విద్యార్థులు ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని మరింత మెరుగుపర్చుకొనేందుకు ఇది ఎంతో ఉపయోగపడనుంది అని అన్నారు. ప్రస్తుత కాలములో ఉన్నత విధ్యాభ్యాసం, ఉద్యోగ సాధన లో ఇంగ్లీషు భాష పై పట్టు సాధించటం, అనర్గళముగా మాట్లాడటం చాలా ముఖ్యం అని తెలిపారు. మన సింగరేణి విధ్యార్ధినులు కూడా ఇంగ్లీషు బాష పై పట్టు సాధించాలానే ఉద్దేశం తో ప్రయోగశాలను సింగరేణి విద్యాసంస్థల్లోనూ ప్రవేశపెట్టాలనే ఉద్దేశం తో బెంగళూరుకు చెందిన తలియోలా ఇన్ఫోటెక్ సంస్థ వారిచే రూపొందించిన సాఫ్ట్ వేర్ తో సింగరేణి మహిళా కళాశాల లో మొత్తం 13.55 లక్షల వ్యయంతో 20 నూతన కంప్యూటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్ధినులు సద్వినియోగ పరచుకొని ఆంగ్ల బాషపై ప్రవీణ్యాన్ని పొందాలని కోరారు. ఈ కార్యక్రమములో సింగరేణి డైరక్టర్ (ఆపరేషన్స్) & పా ఎన్ వికే శ్రీనివాస్, డైరక్టర్(పిఅండ్ పి) జి వేంకటేశ్వర రెడ్డి, డైరక్టర్(ఈఅండ్ఎం) డి సత్యనారాయణ రావు, జిఎం(సిడిఎన్) ఎస్డిఎం. సుభాని, జిఎం(సెక్యూరిటీ),జిఎం(పర్సనల్) ఐఆర్ అండ్ పిఎం బిఆర్ ధీక్షితులు, జిఎం(ఎడ్యుకేషన్) బెనెడిట్ట్నికోలస్,జిఎం(సివిల్) టి సూర్యనారాయణ, ఏజిఎం(పర్సనల్) కే.శ్రీనివాస రావు, అధికారులు, ప్రిన్సిపల్ డాక్టర్ చింతా శారద, ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
