అడ్డంకులు ఎదురైనా సింగరేణి సంస్థను పరిరక్షించుకుంటాం
అడ్డంకులు ఎదురైనా సింగరేణి సంస్థను పరిరక్షించుకుంటాం
-ఐఎన్ టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్
మణుగూరు, శోధన న్యూస్ : ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలంగాణ మణిహారం సింగరేణి సంస్థను పరిరక్షించుకుంటాం అని ఐఎన్ టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి జనక్ ప్రసాద్ కార్మికులకు భరోసా ఇచ్చారు. శనివారం ఏరియా ప్రాతినిధ్య సంఘం సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్ టి యుసి)ఆధ్వర్యంలో మణుగూరులో వివిధ గనులు డిపార్ట్మెంట్ లలో జరిగిన పిట్ మీటింగ్ లలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఓసి 2లో జరిగిన మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణకు మణిహారం, దక్షిణాది పరిశ్రమలు ఆయువుపట్టు 40 వేల మందికి ప్రత్యక్షంగా లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న సింగరేణి సంస్థకు బొగ్గు గనులు కేటాయించకుండా వేలంపాట ద్వారానే బొగ్గు గనులు పొందాలని ఒకవైపు కేంద్రం ఆంక్షలు విధిస్తూనే మరోవైపు సింగరేణి సంస్థను ప్రైవేటీకరించబోమని రెండు నాలుకల ధోరణితో అధికార బిజెపి నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సింగరేణి సంస్థ మనుగడ కొనసాగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఉంటాయని సంస్థను కాపాడుకునే విధంగా ఐ ఎన్ టి యు సి కృషి చేస్తుందని కార్మికుల హర్షద్వానాల మధ్య ఆయన భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఆగస్టు నెలలోనే కార్మికులకు లాభాల బోనస్ ఇచ్చే విధంగా ఏర్పాటు తమ సంఘం కృషి చేస్తుందని అన్నారు.
ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించామని, కార్మికులపై భారం పడకుండా ఆదాయపు పన్ను నుండి పెర్క్స్ యాజమాన్యమే జమ చేసేలా చూస్తామని అన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు రెండు సంవత్సరాలకు పరిమితితోనే ఎన్నికల్లో పాల్గొన్నామని అన్నారు. కార్మిక వర్గానికి కొత్తగూడెంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తున్నామన్నారు ,ఇప్పటికే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా రామగుండం ఏరియాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు పనులు వేగవంతం అయ్యాయని తెలిపారు.
నూతన ఉద్యోగ నియామకాలకు సంబంధించి ముప్పయి ఐదు సంవత్సరములు వయోపరిమితిని నలభై సంవత్సరాలకు పెంచడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం 425 మంది నియామక పత్రాలు అందజేసిందని ఆ కార్మిక వర్గం ఒకరోజు మస్టర్ వేసుకోగానే వాటన్నిటిని నిలిపి వేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆనాడు నిలిచిన 425 మందికి నియామక పత్రాలు అందించి సింగరేణిలో ఉద్యోగులుగా సత్వరమే తీసుకునే విధంగా ఐఎన్ టి యు సి కృషి చేస్తుందని అన్నారు. ప్లే డే, పీహెచ్ డీ లకు సంబంధించి ఎన్ మైనస్ వన్ ఎత్తివేసేందుకు కృషి చేస్తామని, మణుగూరులో పీకే ఓసి 2 లో కార్మికులపై కార్మికులపై అధికారుల ఒత్తిడి ఎక్కువైందని పద్ధతి మార్చుకోవాలని, లేదంటే ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయక తప్పదన్నారు.
రక్షణ చర్యలలో భాగంగా పసుపు కార్డు ఎరుపు కార్డు ఆంక్షల చర్యలు సింగరేణి సంస్థ శ్రేయస్సు రీత్యా సరైన చర్య కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వెంటనే యాజమాన్యం ఈ చర్యలను ఉపసంహరించుకోవాలని సభాముఖంగా ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వేతన సలహా మండలి చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా మునుగూరు సందర్శించిన సందర్భంగా నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో శాలువా పూలమాలతో ఆయన్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎస్ సి ఎం ఎల్ యు ప్రధాన కార్యదర్శి చిన్నయ్య త్యాగరాజన్ , మణుగూరు ఏరియా ఉపాధ్యక్షులు వత్సవాయి కృష్ణంరాజు,కొత్తగూడెం ఏరియా ఉపాధ్యక్షులు ఎండి రజాక్ పాషా , పీతాంబరం, ఏరియా ప్రధాన కార్యదర్శి, అసంఘటితరంగా ఏరియా అధ్యక్షులు సిల్వేరు గట్టయ్య యాదవ్,నాయుడు, షేక్ మస్తాన్, ఎండి షాబుద్దీన్, జయరాజ్, పిట్ సెక్రటరీ,మల్లికార్జున్, సుధాకర్, గుగులోత్ దశరథ్, కృష్ణ చేతన్, రామకృష్ణ, రాము,సంతోష్ చరణ్,యాకయ్య, నాగయ్య, భాగం రవి, ప్రతాప్ రెడ్డి పెద్ద ఎత్తున బ్రాంచ్ కమిటీ నాయకులు కమిటీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.