తెలంగాణభద్రాద్రి కొత్తగూడెంమణుగూరు

సింగరేణి కాంటాక్ట్ కార్మికుల జీవో నెంబర్ 22 అమలు చేయాలి 

సింగరేణి కాంటాక్ట్ కార్మికుల జీవో నెంబర్ 22 అమలు చేయాలి 
 
మణుగూరు, శోధన న్యూస్ :  సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు. పరిష్కరించాలని జీవో నెంబర్ 22  అమలు చేసి నెలకి రూ20వేల జీతం ఇవ్వాలని సింగరేణి కాలనీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు నందం ఈశ్వరరావు సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులను ఉద్దేశించి. రామాలయం దగ్గరలో భోజనం విరామ సమయంలో వారు మాట్లాడుతూ. సింగరేణికి. కాంట్రాక్ట్ కార్మికుల సేవలు మరవలేనివని కానీ సింగరేణి యాజమాన్యం వారి జీతాల పట్ల వారిపట్ల మొండిగా వ్యవహరిస్తుందని సమాన పనికి సమాన వేతనం అన్ని అమలు చేయడం లేదని కనీసం జీవో నెంబర్ 22 నన్ను అమలు చేసి ప్రతి కార్మికుడికి 20 వేల రూపాయల జీతం వచ్చే విధంగా యాజమాన్యం చూడాలని పీఎఫ్ ఈఎస్ఐ కల్పించడంతోపాటు సింగరేణి ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ కార్మికులకు వైద్య సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పించాలని కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు పాఠశాలలో ఉచిత విద్యను అందించాలని కాంట్రాక్ట్ కార్మికులకు ప్రమాదవశాత్తు జరిగే ప్రమాదాలకు యజమాని బాధ్యత తీసుకోవాలని ఇన్సూరెన్స్ పేరుతో 30 లక్షలు. ప్రకటించిన యజమాన్యం సహజ మరణానికి కూడా వర్తించే విధంగా చేయాలని. కార్మికుల సమస్యలు పరిష్కారం యాజమాన్యం కృషి చేయాలని అన్నారు. సిఐటియు జిల్లా నాయకులు సత్రపల్లి సాంబశివరావు మాట్లాడుతూ మూడో తారీకు జరగబోయే బస్సు యాత్రను అధిక సంఖ్యలో పాల్గొని సింగరేణి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని బిజెపి అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేకవిధానాలను కార్మికులు తిప్పికొట్టాలని వారన్నారు. సమావేశంలో కాంట్రాక్ట్ కార్మిక నాయకులు ఇమాంబి, ఉపేంద్ర, భీమయ్య, రంగయ్య, నాగేశ్వరరావు,  నాగరాజు, రాందాస్, సుజాత. అంకమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *