గెలిచిన సంఘానికి వెంటనే గుర్తింపు పత్రం ఇవ్వాలి
సింగరేణి యాజమాన్యం గెలిచిన సంఘానికి వెంటనే గుర్తింపు పత్రం ఇవ్వాలి
మణుగూరు, శోధన న్యూస్ : గెలిచిన సంఘానికి యాజమాన్యం గుర్తింపు, ప్రాతినిధ్య గుర్తింపు పత్రాలను వెంటనే ఇవ్వాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి వల్లూరు వెంకటరత్నం డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా సిఐటియు కార్యాలయంలో గురువారం టీవీ ఎం వి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శి వెంకటరత్నం మాట్లాడారు. సింగరేణిలో ఎన్నికలు జరిగి ఆరు నెలల అయినప్పటికీ ఇప్పటివరకు యాజమాన్యం గుర్తింపు పత్రాలను జారీ చేయకపోవడం , రాజకీయ జోక్యం ఎక్కువైందని విమర్శించారు ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి వెంటనే గుర్తింపు పత్రాలు ఇవ్వాలని, అలాగే గెలిచిన గుర్తింపు , ప్రాతినిధ్య సంఘాలు యాజమాన్యంతో కుమ్మక్కై రెండు సంవత్సరాల కాల పరిమితిని నాలుగు సంవత్సరాలకి పెంచుకోవాలని చూస్తున్నాయని విమర్శించారు. లేబర్ కమిషనర్ ఎన్నికల సమయంలో గుర్తింపు ఎన్నికలు రెండు సంవత్సరాలకి అని అగ్రిమెంట్ చేసిన విషయం విదితమే అన్నారు ఈ విషయంలో కార్మిక వర్గం మరియు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలుకూడా యాజమాన్యంపై ఒత్తిడి తేవాలని కోరారు అలా కాకుండా ఏమైనా మార్పులు జరిగితే గత గుర్తింపు సంఘానికి పట్టిన గతే భవిష్యత్తులో ఈ సంఘాల కూడా పడుతుందని విమర్శించారు ఈ సమావేశంలో మాచారపు లక్ష్మారావు, నందం ఈశ్వరరావు, వై రామ్మూర్తి, లక్ష్మణరావు, విల్సన్ రాజు, ప్రభాకర్ రావు, బుచ్చిరెడ్డి, బొల్లం రాజు, బిక్షపతి, సుమన్, శ్రీకాంత్, కట్కోజుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.