తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో మద్యం, డబ్బు అక్రమ రవాణా ని అరికట్టాలి 

అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో మద్యం, డబ్బు అక్రమ రవాణా ని అరికట్టాలి 

 ఏలూరు, శోధన న్యూస్ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభాలకు గురికాకుండా అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ ల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి అక్రమంగా మద్యం, డబ్బు రవాణాను అరికట్టాలి అని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో ఏలూరు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం కలెక్టర్లు గూగుల్ మీట్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్లు వద్ద ప్రటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి రాష్ట్రంలోకి అక్రమంగా మద్యం మరియు డబ్బు రవాణాను అరికట్టాలని అధికారులకు సూచించారు. ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి ఎన్నికలవేళ అక్రమ మద్యం మరియు డబ్బును అరికట్టాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా మాట్లాడుతూ జిల్లాలో ఇప్పుడు వరకు 19,000 లీటర్ల మద్యం సీజ్ చేయడం జరిగిందని, చెక్ పోస్ట్ లో వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి నిరంతర తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద మద్యం అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసామని, పోలీస్ మరియు అటవీశాఖ అధికారుల సమన్వయంతో తనిఖీలు చేసి పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. బోగస్ ఓటింగ్ ను నివారించేందుకు చివరి 48 గంటల కాలంలో అంతర్ రాష్ర్ట సరిహద్దులలో ఓటర్ల పటిష్టమైన తనిఖీ చేపడతామని తెలిపారు. సమస్యాత్మక ప్రదేశాలు గుర్తించి చెక్ పోస్ట్ ఏర్పాట్లు చేసామని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 74 లక్షల నగదును సీజ్ చేసినట్లు అందులో 67 లక్షలు విడుదల చేయగా మొత్తం 28 కేసులు బుక్ చేయగా అందులో 23 కేసులు విడుదల చేయగా మిగిలిన 5 పురోగతిలో ఉన్నాయని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *