సింగరేణి ఉద్యోగుల సామాజిక సేవలు స్ఫూర్తిదాయకం
సింగరేణి ఉద్యోగుల సామాజిక సేవలు స్ఫూర్తిదాయకం
-ఏరియా ఎస్ ఓ టు జి ఎం శ్యాంసుందర్
మణుగూరు, శోధన న్యూస్ :సింగరేణి ఉద్యోగుల సామాజిక సేవలు స్ఫూర్తిదాయకమని మణుగూరు ఏరియా ఎస్ టు జి ఎం డి శ్యాంసుందర్ ప్రశంసించారు. స్థానిక ఓసి-2 రిలే సి డంపర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న ఎండి అహ్మద్ తమ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సంతోష్ నగర్ శ్రీ విద్యాభ్యాస (పూర్వ బాలవెలుగు) పాఠశాలకు గురువారం రెండున్నర క్వింటాళ్ల బియ్యాన్ని వితరణగా అందజేసే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పనిపట్ల అంకితభావంతో పాటు సాటివారిని ఆదుకోవాలనే తలంపు ఉన్న అహ్మద్ ను సహకరిస్తున్న ఆయన కుటుంబ సభ్యులను అభినందించారు. మణుగూరు సమీప గ్రామాలకు చెందిన ఆదివాసి గిరిజన, అనాధ పిల్లలను, బాల కార్మికులను చేరదీసి వారికి చదువు తోపాటు కళలు, క్రీడలలో తగు శిక్షణ ఇచ్చి ప్రవేశ పరీక్ష ద్వారా ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చేర్పించే వరకు పాఠశాల నిర్వాహకులు ఏ రకంగా కష్టపడుతున్నారు. అనే అంశంపై ఆయన నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. సింగరేణి సేవా సమితి సభ్యులు యస్ డి నా సర్ పాషా సమన్వయంతో సింగరేణి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు అందిస్తున్న ప్రధాన సహకారం తోటే ఈ మహా యజ్ఞం కొనసాగించగలుగుతున్నామని ఆయన తెలిపారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్ని దానాల కన్నా విద్యా దానం గొప్పదని ఆయన అందరిని అభినందించారు. దాతలు అందిస్తున్న సహకారంతో విద్యార్థిని విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన చిన్నారులకు శుభ ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సేవా సమితి సభ్యులు యస్ డి నా సర్ పాషా, అంగోత్ మంగీలాల్ పాఠశాల నిర్వాహకులు బి జగన్మోహన్ రెడ్డి, సిబ్బంది సుహాసిని దేవి, స్వాతి, రాధ తదితరులు పాల్గొన్నారు.