వర్షాకాలం దృష్ట్యా పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
వర్షాకాలం దృష్ట్యా పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
-సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
– త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలి
– మండల అధికారులకు ఎమ్మెల్యే పాయం ఆదేశం
పినపాక నియోజకవర్గం, శోధన న్యూస్ : వర్షాకాలం దృష్ట్యా పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మండల అధికారులు ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పర్యటనలో భాగంగా మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి మండల పంచాయతీ అధికారులతో అయినా మాట్లాడుతూ మండల వ్యాప్తంగా అన్ని పంచాయతీల పరిధిలో సీజనల్ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రతి పంచాయతీలలో డ్రైనేజీ పూడికలు తీయించాలని ఆదేశించారు. దోమల బ్యాటరీ చింతకుంట విధిగా దోమల మందు పిచికారి చేయించాలని పేర్కొన్నారు. తాగునీరు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని త్రాగునీరు కలుషితం కాకుండా గ్రామాల్లోని ట్యాంకులను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసి క్లోరినేషన్ చేయించాలని తెలియజేశారు. ప్రతి వీధి నందు విధిగా బ్లీచింగ్ చెల్లించాలని వీధులు పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని అన్ని పంచాయతీ ప్రత్యేక అధికారులు కార్యదర్శులు గ్రామాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోండి తెలిపారు.