పాత నేరస్తులు,రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా
పాత నేరస్తులు,రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా
భద్రాద్రి కోత్తగూడెం, శోధన న్యూస్: కొత్తగూడెం పట్టణంలోని ఐఎంఏ ఫంక్షన్ హాలులో ఈ రోజు జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ సమావేశమయ్యారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన ప్రణాళికను తయారు చేసుకుని ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగే విధంగా భాద్యతగా పనిచేయాలని ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ అన్నారు.ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.ఎన్నికల సంఘం ఆదేశాలతో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుండి ఎన్నికల సంఘం ప్రతి కదలికను నిశితంగా పరిశీలిస్తుందని తెలియజేసారు.ఎన్నికల విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.ఎన్నికల బందోబస్త్ మరియు ఇతర విధుల గురించి ఎవరికైనా సందేహాలు ఉంటే వెంటనే సంభందించిన అధికారులతో మాట్లాడి వాటిని నివృత్తి చేసుకోవాలని తెలిపారు.పాతనేరస్తులు,రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకొని సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా వారు ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.తమ తమ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలింగ్ స్టేషన్లను,రూట్ మ్యాప్ ను గురించి తమ సిబ్బందికి ముందుగానే వివరించి వాటిని సందర్సించాలని సూచించారు.