శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి
శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: కొత్తగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ గా విధులు నిర్వర్తిస్తున్న ప్రసాద్ పదవీ విరమణ సందర్భంగా కొత్తగూడెం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలోని పిఆర్ ఫంక్షన్ హాల్ నందు సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా జిల్లా పోలీస్ శాఖలో నిజాయితీగా భాద్యతతో విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందుతున్న ఏఎస్ఐ ప్రసాద్ కుఅభినందనలు తెలిపారు.శేష జీవితాన్ని తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరంగా జీవించాలని సూచించారు.పోలీసు శాఖలో పనిచేస్తూ ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయటం గొప్ప వరమని అన్నారు.నిబద్ధత,బాధ్యతతో విధులు నిర్వర్తించే వారికి ఎల్లప్పుడూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అన్నారు.ఏఎస్ఐ ప్రసాద్ క్రమశిక్షణతో పోలీస్ శాఖకు అందించిన సేవలను,ఆయన పనితీరును ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.పదవీ విరమణ తర్వాత ఎలాంటి అవసరం ఉన్నా వెంటనే తమను సంప్రదించవచ్చని అన్నారు.అనంతరం ఆయనను శాలువాలు,పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,సిఐలు నాగరాజు,వెంకటేశ్వర్లు,కరుణాకర్,శివప్రసాద్,రమేష్,ఇంద్రశేనా రెడ్డి,ఎస్సైలు రమణా రెడ్డి, ప్రవీణ్,ట్రాఫిక్ ఎస్సైలు నరేష్,జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు.