వెబ్ సైట్ లో శ్రీ రామానవమి టిక్కెట్లు
వెబ్ సైట్ లో శ్రీ రామానవమి టిక్కెట్లు
భద్రాచలం, శోధన న్యూస్: ఈ నెల 17వ తేదీన జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకల టికెట్లు భక్తుల సౌకర్యార్థం htts://bhadradritemple.telangana.gov.in వెబ్ సైట్ నందు అందుబాటులో ఉంచినట్లు సమాచార పౌర సంబంధాలు, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్లు కొనుగోలు చేసి స్వామివారి కల్యాణ వేడుకలు వీక్షించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉభయ దాతలకు 7500 గోత్రనామాలు కూడా చదవడం జరుగుతుందని మరియు స్వామి వారి వస్త్రాలు, తలంబ్రాలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. 2 వేలు, ఒక వేయి మరియు 300 వందల టికెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. భక్తులు ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసి కళ్యాణ వైభవం వీక్షించాలని, భక్తులకు సెక్టార్ల లో మంచినీరు, మజ్జిగ ఉచిత పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సెక్టార్ లో చలువ పందిళ్లు ఏర్పాటుతో పాటు ఫాన్స్, కూలర్స్ వంటివి ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.