వైభవంగా ప్రారంభమైన శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహోత్సవాలు
వైభవంగా ప్రారంభమైన శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహోత్సవాలు
-14న ఆదిలక్ష్మి చెంచులక్ష్మీ సమేత శ్రీనృసింహస్వామి స్వామి కళ్యాణం, అన్నదానం
-15న ఉత్సవ మూర్తుల శోభాయాత్ర
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని సమితిసింగారం గ్రామపంచాయితీ పాత ఐటిఐ కళాశాల ఎదురుగా కొలువుదీరి యున్న శ్రీశ్రీశ్రీ సంకల్ప వరసిద్ది శ్రీలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థాన ద్వితీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు సోమవారం నుండి వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా సంకల్ప వరసిద్ది శ్రీలక్ష్మీనృసింహస్వామి వారికి ఆలయ వ్యవస్థాపక ప్రధానాచార్యులు అక్కినేపల్లి శ్యామ్ ఆచార్యులు-సంధ్యారాణి మంత్రోచ్చరణల నడుమ కిషోర్-నవనీత దంపతులు, రామచంద్రయ్య-రాజేశ్వరి దంపతులు, వాసిరెడ్డి వెంకటేశ్వర్లు-ధనలక్ష్మీ దంపతులు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం ఉదయం 5గంటలకు మంగళవాయిద్యాలతో మంగతోరణాలు, సుప్రభాతసేవ, 6.30గంటలకు స్వామి వారి మూలవిరాట్‌కి, పరివార దేవతలకు, ఉత్సవ మూర్తులకు అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించి సుందరంగా అలంకరించారు. ఉదయం 9గంటలకు గోపూజ శ్రీవిష్వక్షేన మహగణాధిపతి పూజ, పుణ్యహవచనం, రక్షాబంధన అఖండదీప స్థాపన, సర్వతోభద్ర మండలాది దేవతా నవనారసింహ దేవత ఆవాహన అర్చనలు నిర్వహించారు. 11.30గంలకు అగ్ని ప్రతిష్ట, గణపతి హోమం, మహ నైవేద్యం, మంత్రపుష్పం, మంగళ నీరాజనములు, తీర్ధప్రసాద వితరణ చేశారు. సాయంత్రం 6గంటల నుండి భజన కార్యక్రమం,రాత్రి 8గంటలకు మహానైవేద్యం, మంత్ర పుష్పం, మంగళనీరాజనములు, తీర్ధప్రసాద వితరణ చేయడం జరిగింది. 13న ప్రత్యేక పూజల్లో భాగంగా తులసిదళార్చన పూజ, గీతాధర్మప్రచార సమితి ఆధ్వర్యంలో పూజలు, పారాయణాలు, 14న ఉదయం 10.30గంటలకు ఆదిలక్ష్మి చెంచులక్ష్మీ సమేత శ్రీనృసింహస్వామి స్వామి వార్లకు అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం, భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం జరగనుంది. 15వ తేదీన ఆదిలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీనృసింహస్వామి స్వామి వార్ల శోభాయాత్ర ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వార్ల కృపకు పాత్రులు కావాలని ప్రధానాచార్యులు శ్యామ్ ఆచార్యులు తెలిపారు.