ఎన్నికలు సజావుగా నిర్వహణకు చర్యలు చేపట్టాలి
ఎన్నికలు సజావుగా నిర్వహణకు చర్యలు చేపట్టాలి
-జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విపి గౌతమ్
ఖమ్మం,శోధన న్యూస్: లోక్ సభ ఎన్నికల సజావు నిర్వహణకు అన్ని చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విపి గౌతమ్ తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, నూతన కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఖమ్మం లోకసభ నియోజకవర్గ ఏడు సెగ్మెంట్ల సహాయ రిటర్నింగ్ అధికారులతో నామినేషన్ సహాయక కేంద్రాల ఏర్పాటు, పోస్టల్ బ్యాలెట్, ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్, పోలింగ్ సిబ్బందికి రెండో విడత శిక్షణ, ఓటర్ నమోదు, ఇవిఎం స్ట్రాంగ్ రూంల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు సబంధించి ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల మేరకు అన్ని ముందస్తు చర్యల్లో వేగం పెంచాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో విఐపి ఓటర్లను మార్క్ చేయాలని, విఐపి ఓటర్ నమోదు జాబితాలో లేనిచో వెంటనే నమోదుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల వారిగా 18 – 19 సంవత్సరాల వయస్సు కలవారు 4 శాతానికి తక్కువ ఉంటే, దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి నమోదులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ నెల 18 నుండి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, నామినేషన్ లకు సంబంధించి సామాగ్రి, ఎలక్షన్ కమిషన్ నుండి నామినేషన్ ప్రింటెడ్ పత్రాలు మంగళవారం రానున్నాయని, ఇట్టి బ్లాంక్ నామినేషన్ పత్రాలు అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. సహాయక కేంద్రాన్ని ఏర్పాటుచేసి, పోటీచేసే అభ్యర్థి, ప్రపోజర్ల ఓటుహక్కు ఉన్నది లేనిది చూడడం, నామినేషన్ పత్రాల పూరింపు, జతచేయు పత్రాలపై అవగాహన కల్పించడం చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్లు, ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్, ఆబ్సెంటీ ఓటర్లు, 85 సంవత్సరాల వయస్సు దాటిన సీనియర్ సిటీజేన్లు, దివ్యాoగులు, ఎస్సెన్షియల్ సర్వేసెస్ లో పనిచేసే వారికి ఫారం 12, 12ఏ లు తీసుకోవాలన్నారు. ఎన్ఐసి పోర్టల్ నుండి ఎవరు, ఎక్కడ పనుచేయుచున్నది నివేదిక తీసుకొని, దాని ప్రకారం చర్యలు చేపట్టారు. గత ఎన్నికలో హోమ్ ఓటింగ్ సౌకర్యం కల్పించిన వారికి తిరిగి కల్పించాలన్నారు. మే 3 నుండి హోం ఓటింగ్ చేపట్టనున్నట్లు, దీనికి అన్ని చర్యలు చేపట్టాలన్నారు. సెగ్మెంట్లలో ఇవిఎంల భద్రపర్చుటకు స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేయాలని, పోస్టల్ బ్యాలెట్లు భద్రపర్చడానికి మండల స్థాయిలో భద్రతతో కూడిన స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటుచేయాలన్నారు. సువిధ అనుమతులు నిర్ణీత కాలవ్యవధిలోగా జారీచేయాలన్నారు.