నిరుద్యోగ గిరిజన యువతకు జీవనోపాధి కల్పించేందుకు చర్యలు -ఖమ్మం జిల్లా ఇంచార్జ్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నిరుద్యోగ గిరిజన యువతకు జీవనోపాధి కల్పించేందుకు చర్యలు
-ఖమ్మం జిల్లా ఇంచార్జ్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
భద్రాచలం, శోధన న్యూస్ : నిరుద్యోగ గిరిజన యువతకు జీవనోపాధి కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఖమ్మం జిల్లా ఇంచార్జ్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నిరుద్యోగులైన గిరిజన యువతి యువకులకు జీవనోపాధి పెంపొందించుకొని జీవించడానికి ఐటీడీఏ ద్వారా వృత్తి శిక్షణలు ఇప్పించడంతో పాటు మ్యాక్స్ సంస్థ ద్వారా వారికి అన్ని రకాల వసతులు కల్పించడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఖమ్మం జిల్లా ఇంచార్జ్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ సమావేశం మందిరంలో ఏర్పాటుచేసిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. పై చదువులు చదవలేక డిగ్రీ ఇంటర్ పదవ తరగతి వరకు చదువుకున్న గిరిజన యువతి యువకులు శిక్షణలో తీసుకొని వారి కుటుంబాలను పోషించుకోవడానికి జిల్లా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ మరియు ఐటీడీఏ వైటిసి ద్వారా వివిధ రకాల శిక్షణలో ఇవ్వడం చాలా సంతోషమని దానిలో ముఖ్యమైనది న్యాక్ సంస్థ ద్వారా నిష్ణాతులైన ఫ్యాకల్టీలచే ప్రత్యేక శిక్షణలు ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తామని అన్నారు. దీనిలో భాగంగా భద్రాచలం మధిర కొత్తగూడెం ఖమ్మం ఇల్లందు మండలాలలో యువతకు శిక్షణ ఇవ్వడానికి ప్రణాళికలు రూపొందించాలని ఆయన అన్నారు. అలాగే 1975వ సంవత్సరంలో గిరిజనుల అభివృద్ధి కొరకు ఐటీడీఏలు ఏర్పాటు చేయడం జరిగిందని, ముఖ్యంగా పౌలు భూముల పట్టాలు రైతుబంధు రైతు భరోసా గిరిజన గ్రామాలలో రోడ్డు సౌకర్యం కల్పించి గిరిజనుల అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. అలాగే జిల్లా అభివృద్ధి కొరకు త్వరలో నిధులు మంజూరు చేస్తామని ఆ నిధులతో గిరిజన గ్రామాల అభివృద్ధితోపాటు నిరుద్యోగ గిరిజన యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని ఆ దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని అందుకు శాసనసభ్యులు, అధికారులు సమన్వయంతో గిరిజనుల కొరకు గిరిజన గ్రామాలలో పోడు భూముల సమస్య గిరిజన రైతులకు సబ్సిడీపై కరెంటు బోర్లు రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆ దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అన్నారు.