మణుగూరు రైల్వే స్టేషన్ రోడ్డులో వీధిలైట్లను పునరుద్ధరించాలి
మణుగూరు రైల్వే స్టేషన్ రోడ్డులో వీధిలైట్లను పునరుద్ధరించాలి
మణుగూరు, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం రైల్వే గేట్ నుండి మణుగూరు రైల్వే స్టేషన్ వరకు వీధిలైట్లు పునరుద్ధరించాలని గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం (ఇఫ్టూ) ఆధ్వర్యంలో గురువారం సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా ఇంజనీర్ ఎం నర్సిరెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్ డి నా సర్ పాషా మాట్లాడుతూ రైల్వే స్టేషన్ రోడ్డులో వీధిలైట్లు వెలగకపోవటంతో రైలు ప్రణికులతో పాటు ఈ మార్గం లో రాత్రి వేళల్లో ప్రయాణించే సింగరేణి పునరావాస కొత్త పద్మగూడెం, రాయన్న పేట గిరిజనులు ఇబ్బంది పడుతున్నారన్నారు, వీధిలైట్ల ఏర్పాటు చేయడంతో పాటు ఆకతాయిలు వాటిని పగలగొట్టకుండా తగు జాగ్రత్తలు కూడా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏరియా నాయకులు ఏ మంగీలాల్ పాల్గొన్నారు.