మహిళలను వేధిస్తే కఠిన చర్యలు
మహిళలను వేధిస్తే కఠిన చర్యలు
-రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీనివాస్
గోదావరిఖని ,శోధన న్యూస్ : మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ హెచ్చరించారు. రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో మహిళల భద్రత కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ అన్నారు. మహిళలు ఫిర్యాదులు చేస్తే సత్వరమే స్పందించి తగిన విధంగా న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు, మహిళలకి ప్రయాణాల్లో, పని ప్రదేశాల్లో , ఇతర చోట్ల ఎదురయ్యే వివిధ రకాల వేధింపుల నుండి రక్షణ కోసం షి టీమ్స్ బృందాలు అన్ని వేళలా అందుబాటులో ఉంటాయని అన్నారు. షీ టీం బృందాలను కలిసి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు అనీ డయల్ 100, వాట్సాప్, క్యూఆర్‌కోడ్ తదితర అనేక విధానాల్లోనూ ఫిర్యాదులు చేయవచ్చు అన్నారు. ఆడపిల్లలను,మహిళలను వేధించినా, అసభ్యంగా ప్రవర్తించినా, తిట్టినా, వారి ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసినా, సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేసినా, మిత్రులకు షేర్ చేసినా తీవ్రమైన నేరంగా పరిగణించి ఎలాంటి కఠిన శిక్షలు వేస్తున్నారో షీటీమ్స్ కాలేజీల్లో, స్కూళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ నిందితుడు మైనర్ అయితే అతడికి తల్లితండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది.ఎవరైనా మహిళలు వేధింపులకు గురైనట్లయితే వెంటనే డయల్ 100, షీ టీం నెంబర్ 6303923700 ఫోన్ చేసి లేదా వాట్సప్ ద్వారా సమాచారం ఇవ్వవచ్చు వెంటనే అందుబాటులో ఉంటుంది. మహిళల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అని తెలిపారు.