మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు మద్యం సేవించి వాహనాలను నడిపే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు.మద్యం సేవించి వాహనాలను నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు గురయ్యి చాలామంది ప్రాణాలను కోల్పోతున్నారు.మరి కొంతమంది విగత జీవులుగా మారుతున్నారు.రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో భాగంగానే జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ పరీక్షలను నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా ఎస్పీ వెల్లడించారు.డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో పట్టుబడిన వారికి ఇకనుండి జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఇకపై జిల్లా వ్యాప్తంగా నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.