కోడిపందాలకు పాల్పడితే కఠిన చర్యలు
కోడిపందాలకు పాల్పడితే కఠిన చర్యలు
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 11- శోధన న్యూస్ :
పేకాట,కోడిపందాలు నిర్వహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు. జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. .అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.నిరంతర వాహన తనిఖీలు,సరిహద్దు ప్రాంతాల్లో గుర్తించబడిన కొన్ని ప్రదేశాలలో గస్తీని ముమ్మరం చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్,ఛత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దుగా గల జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో పనిచేసే అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. పట్టుబడిన నిందితులపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులందరికి ఆదేశాలివ్వడం జరిగిందన్నారు.అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారి గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు.సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.


