తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

మద్యం సేవించి వాహనాలు నడిపుతూ పట్టుబడితే కఠిన చర్యలు -భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

మద్యం సేవించి వాహనాలు నడిపుతూ పట్టుబడితే కఠిన చర్యలు
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ :
మద్యం సేవించి వాహనాలు నడిపుతూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు. గురువారం జిల్లా  ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రధాన రహదారులపై పోలీస్ అధికారులు ఏకకాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. రెండు గంటల పాటు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో భాగంగానే ఇలాంటి తనిఖీలు నిర్వహిస్తూ ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు. ప్రధానంగా భారీ వాహనాలను రాత్రి వేళల్లో మద్యం సేవించి అతి వేగంగా నడిపే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేయడం జరుగుతుందని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి జైలు శిక్ష తప్పదని ఈ సందర్బంగా తెలిపారు.ఇక నుండి ప్రతి రోజూ జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎవ్వరూ కూడా నిబంధనలు అతిక్రమించొద్దని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *