తెలంగాణరాజన్న సిరిసిల్ల

  వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు

  వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు
– రాజన్న సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల ,శోధన న్యూస్: మహిళల,విద్యార్థినిల భద్రత కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు,వారి ఫిర్యాదుల పట్ల సత్వరమే స్పందించి తగిన విధంగా న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మహిళలకి ప్రయాణాల్లో, ఇతర చోట్ల ఎదురయ్యే వివిధ రకాల వేధింపుల నుండి రక్షణ కోసం జిల్లాలో షి టీమ్స్ బృందాలు అన్ని వేళలా అందుబాటులో వుండి వేధింపులకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తారని తెలిపారు.ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ ఐడి లతో ఇంస్టాగ్రామ్,ఫేస్ బుక్ అకౌంట్ లు క్రియేట్ చేసి, మహిళల సోషల్ మీడియా అకౌంట్స్ ని హ్యాక్ చేసి అసభ్యకర వీడియోలు, ఫోటోస్ పంపుతూ మహిళలు,విద్యార్థినుల వేధింపులు గురి అవుతున్న పిర్యాదులు ఎక్కవ వస్తున్నాయని,అలాంటి వేధింపులకు పాల్పడే పోకిరిల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, సోషల్ మీడియా వేదికగా ఆడపిల్లలను,మహిళలను వేధించినా,అసభ్యకరంగా ఫొటోలు,వీడియోలు పంపిన, సోషల్‌ మీడియా అకౌంట్లలో పోస్టు చేసినా,మిత్రులకు షేర్‌ చేసినా తీవ్రమైన నేరంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఇలాంటి సమస్యలపై జిల్లా పోలీసు యంత్రాంగం నిఘా ఉంటుందని అన్నారు.ఇలాంటి సమస్యలపై మహిళలు,విద్యార్థినులు నిర్భయంగా జిల్లా షీ టీమ్ కి పిర్యాదు చేయాలని  తెలిపారు. మహిళలు, విద్యార్థినులు వేధింపులకు గురైనట్లయితే వెంటనే డయల్ 100, లేదా షీ టీం నెంబర్ 87126 56425 కి పిర్యాదు చేసినచో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని,పిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *