పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాలో 10 వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ ను అమలు చేస్తున్నట్లు తెలిపారు.పరీక్షలు రాయడానికి హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతంగా సమాధానాలు రాయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు చేపట్టే చర్యలకు ప్రజలు, విద్యార్థులు పోలీస్ వారి సూచనలు పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పరీక్షా కేంద్రాల దగ్గర అన్ని జిరాక్స్ సెంటర్స్ మూసివేయాలని సూచించారు..పరీక్ష రాయడానికి హాజరయ్యే విద్యార్థులు మాత్రమే పరీక్ష కేంద్రంలోనికి అనుమతించడం జరుగుతుందన్నారు. గేటు మూసివేసిన తర్వాత ఎవ్వరినీ లోపలికి అనుమతించరన్నారు. విద్యార్థులకు,ఇన్విజిలేటర్స్, ఎగ్జామ్ చీఫ్ సూపరింటెండెంట్స్ నకు కూడా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించబడవన్నారు. పరీక్షా కేంద్రంలో ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే దగ్గరలోని పోలీసు వారికి సమాచారం అందించాలన్నారు.