ఎల్లమ్మ ఆలయ చైర్మన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన సురేందర్ రెడ్డి
ఎల్లమ్మ ఆలయ చైర్మన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన సురేందర్ రెడ్డి
హుస్నాబాద్, శోధన న్యూస్ : హుస్నాబాద్ పట్టణంలో ఎల్లమ్మ ఆలయ చైర్మన్ పూదరి లక్ష్మి నారాయణ అమ్మ పూదరి వజ్రవ్వ ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు జన్నపు రెడ్డి సురేందర్ రెడ్డి పరామర్శించారు. అనంతరం వజ్రవ్వ గారి చిత్ర పటానికి పూల మాలలు వేసి వారి మృతికి గల కారణాలను అడిగితెలుసుకున్నారు,వారి ఆత్మ కి శాంతి కలగాలని భగవంతుడు వారి కుటుంబానికి మనో ధైర్యాన్ని ప్రసాదించాలని అన్నారు. వీరి వెంట బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షులు బత్తుల శంకర్ బాబు,అక్కన్నపేట మాజీ మండల అధ్యక్షులు గొల్లపల్లి వీరాచారి, బీజేపీ నాయకుల బద్ది పడగ జైపాల్ రెడ్డి,నునవాత్ మోహన్ నాయక్, బొనగిరి రవి,కురిమెల్ల శ్రీనివాస్, గాదాసు రాం ప్రసాద్,రాజేందర్,అనంత స్వామి, మడక రవి కుమార్, వెల్దండి సంతోష్, పెందోట భూశంకరాచారీ, నారోజు నరేష్, బోడిగే వెంకటేష్, అశాడపు శ్రీనివాస్, బొనగిరి రాజేష్,రాకేష్,నవీన్,హరీష్ తదితరులు ఉన్నారు.