నిత్యావసర సామాగ్రి సరఫరాకు టెండర్లు ఆహ్వానం
నిత్యావసర సామాగ్రి సరఫరాకు టెండర్లు ఆహ్వానం
భద్రాచలం, శోధన న్యూస్: నూతన విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో గల పాఠశాలలకు, వసతి గృహాలకు అవసరమైన కోడిగుడ్లు, కూరగాయలు, అరటి పండ్లు, స్కిన్లెస్ చికెన్, పాలు (టెట్రా) సరఫరా చేసేందుకు ఆసక్తిగల అమ్మకం దారుల నుండి సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తునట్లు భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ గురువారం తెలిపారు. టెండర్ ఫారం ధర రూ.2000, కూరగాయలు రూ.40,000లు, పండ్లు రూ.25,000లు, కోడిగుడ్లు రూ.45,000లు, స్కిన్లెస్ చికెన్ రూ.40,000లు, పాలు టేట్రా రూ.40,000లు ఉప సంచాలకులు (గిరిజన సంక్షేమ శాఖ ) భద్రాచలం పేరున డిడి ద్వారా ఎస్ బిఐ బ్యాంకులో డిపాజిట్ చెల్లించి టెండర్ లో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈనెల 10వ తేదీ నుండి 18వ తేదీ వరకు టెండర్ ఫారములు ఉపసంచాలకులు భద్రాచలం కార్యాలయంలో పొందవచ్చునని, ఎస్టి, ఎస్సి సరఫరాదారులకు ధరావత్ డిపాజిట్లో 40 శాతం రాయితీకలదని జూన్ 18 సాయంత్రం 5 గంటల వరకు టెండర్ ఫారాలు సమర్పించాలని ఆయన అన్నారు. పాన్ కార్డ్ ,టిన్ కార్డ్ నెంబర్లు, సొంత దుకాణం, బ్యాంక్ ఖాతా కలిగి భద్రాద్రి జిల్లాకు చెందిన వారై ఉండాలని, జూన్ 19 ఉదయం 11 గంటలకు సీల్డ్ టెండర్స్ తెరచి తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు.