ప్రశాంత పోలింగ్ కు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు
ప్రశాంత పోలింగ్ కు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు
-పినపాక నియోజకవర్గ ఏఆర్ఓ ప్రతీక్ జైన్
మణుగూరు, శోధన న్యూస్ : మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా పినపాక నియోజకవర్గం లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు సహకరించిన నియోజకవర్గ ప్రజలకు పినపాక నియోజకవర్గం పినపాక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మార్చి 16 నుండి, నోటిఫికేషన్ ఏప్రిల్ 18 నాటి నుంచి మే 13 న పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల నిర్వహణలో నియోజకవర్గం ప్రజల సహకారం , వారి యొక్క భాగస్వామ్యం మరువలేనిదని అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా జరగడానికి సహకరించిన వివిధ పార్టీల రాజకీయ ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. సమస్యాత్మక ప్రభావిత మండలాలైన గుండాల, కరకగూడెం, ఆళ్లపల్లి మండలాలలో ఎటువంటి విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన అధికారులకు, అనధికారులకు పినపాక నియోజకవర్గం లోని మండలాల ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పినపాక నియోజకవర్గం ఎన్నికలు సజావుగా జరగడానికి ప్రత్యేక బాధ్యత తీసుకొని విధులు నిర్వహించిన మణుగూరు తహశీల్దార్ రాఘవరెడ్డి కి, నయాబ్ తహశీల్దార్ ఎలక్షన్ నాగరాజు , రెవెన్యూ సిబ్బందికి అందరికీ పేరుపేరునా ఆయన అభీనందనలు తెలిపారు.