ఓటు హక్కు పై అవగాహన కల్పించడమే లక్ష్యం
ఓటు హక్కు పై అవగాహన కల్పించడమే లక్ష్యం
కరకగూడెం ,శోధన న్యూస్ : పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న వేళ కరకగూడెం తాసిల్దార్ నాగ ప్రసాద్ వినూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికి తాసిల్దార్ అనే కార్యక్రమం తో ప్రజల వద్దకు వెళ్లి ఓటు హక్కు అవగాహనపై ప్రజలలో చైతన్యం తీసుకురావడం ఉద్దేశంతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వింటూ భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ప్రజలకు వజ్రాయుధంగా పనిచేస్తుందని, ఓటును అమ్ముకోకుండా అభివృద్ధి చేసే వారికే స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించే విధంగా ప్రజలలో చైతన్యం తీసుకొని వస్తామని ఆయన అన్నారు. బుధవారం నుంచి రోజుకు గ్రామపంచాయతీ చొప్పున 16 గ్రామ పంచాయతీలలో ఉన్న గ్రామాలను సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ. ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు తెలియజేస్తామని ఆయన అన్నారు.