తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం 

 

పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం 

  • తెలంగాణ రాష్ట్ర  వ్యవసాయ,సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం అని   తెలంగాణ రాష్ట్ర  వ్యవసాయ,సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.  సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసగూడెం పంప్ హౌస్ ను మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ సహకార శాఖల  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే  జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ , ఐటీడీఏ పీవో రాహుల్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు పంపు హౌస్ లో చేపట్టిన పనుల వివరాలను మ్యాప్ ద్వారా మంత్రికి వివరించారు. ట్రైలర్ కు సిద్ధంగా ఉన్న మోటార్లను మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంపు హౌస్ లో ఏర్పాటు చేసిన మోటర్లు చైనా షాంగై కంపెనీ రూపొందించినవని, చైనా నుండి ఆ కంపెనీ ఇంజనీర్లు రావాల్సి ఉందని వచ్చిన అనంతరం పంప్ హౌస్ యొక్క ట్రైలర్ నిర్వహిస్తామని తెలిపారు. అతి త్వరలో చైనా ఇంజనీర్లు రావడానికి భారత ప్రభుత్వం మరియు చైనా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నదని తెలిపారు. పంపు హౌస్ లో ఇరిగేషన్ మరియు ఎలక్ట్రికల్ పనులు అన్ని పూర్తి అయినవి తెలిపారు. మోటర్లు చైనా వి అయినందువలన వారి ఇంజనీర్ ల సమక్షంలో ట్రయల్ రన్ పూర్తి చేసుకొని,   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆగస్టు నెలలో గోదావరి జలాలను ఏన్కూరు లింకు కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్ కు తరలించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి యొక్క కోరిక అని ఆయన అన్నారు. కృష్ణా జలాలు అనుకున్న సమయంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ కు రాకపోయినా వైరా ప్రాజెక్టు, సాగర్ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న ఆయకట్టుతోపాటు మధ్యలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటికీ గోదావరి జలాలను పంపించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం అని తెలిపారు.

ఈ పంప్ హౌస్ లో పంపులు బిగించి నాలుగు సంవత్సరాలు పూర్తయినందు వల న ఈ సంవత్సరం తప్పనిసరిగా ట్రయల్ రన్ పూర్తి చేయకపోతే పంపులకు కూడా ప్రమాదం ఉన్నదని నిపుణులు సూచించారని తెలిపారు. ట్రైలర్ త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జూలూరుపాడు టర్నల్ పూర్తి అయ్యే లోపు గోదావరి జలాలను వాడుకుంటూ పంప్ హౌస్ లను వినియోగంలోకి తీసుకురావాలని, అలాగే ఈ పంపులు చెడిపోకుండా చూసుకునే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదని ఆయన తెలిపారు. ఏన్కూరు టర్నల్, లింక్ కెనాల్ ను అత్యవసర ప్రాతిపదిక పైన ముఖ్యమంత్రి అనుమతితో ఈ నెలలో పూర్తి చేయబోతున్నామని తెలిపారు. టర్నల్ వరకు 104 కిలోమీటర్ల కెనాల్ ను 97% పూర్తి అయిందని కేవలం మూడు శాతం లైనింగ్ పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నవని అవి కూడా ఈ సీజన్ తర్వాత పూర్తి చేస్తామని తెలిపారు.

గోదావరి జలాలతో ఈ మూడు పంప్ హౌస్ లను వినియోగించుకోవడంతోపాటు నాగార్జునసాగర్ ఆయకట్టు కి మీడియం ప్రాజెక్టులు అయినా వైరా లంక సాగర్ కు ఈ సంవత్సరం గోదావరి జలాలను తరలిస్తామని తెలిపారు. వచ్చే సీజన్ నాటికి యాతలకుంట టర్నల్ పనులు పూర్తి చేసి సత్తుపల్లి నియోజకవర్గంలో పాటు అశ్వరావుపేట నియోజకవర్గానికి కూడా నీరు అందిస్తామని తెలిపారు. 7800 కోట్ల రూపాయల ఖర్చుతో పంప్ హౌస్ నిర్మాణం చేపట్టామని వీటిని వినియోగం లోనికి తేవడం తో పాటు జూలూరు పాడు టర్నల్ పనులు పూర్తి చేసి గోదావరి జలాలను పాలేరు కు చేరుస్తామని తెలిపారు. అక్కడ మున్నేరు మీద ఆకేరు మీద టర్నల్ పనులు కూడా జరుగుతున్నాయని తెలిపారు. అత్యవసరం అయినా జూలూరుపాడు టర్నల్ పనులు పూర్తి చేయాలని, పది కిలోమీటర్ల ఫారెస్ట్ అనుమతి తెచ్చుకోవాలని ఆయన తెలిపారు. ఆనాడు 13,500 కోట్లతో పనులు మొదలు పెట్టామని ఇప్పటివరకు 7800 కోట్లు ఖర్చు చేశామని ఆ మంత్రి తెలిపారు. భవిష్యత్తులో ఈ పంప్ హౌస్ లను వినియోగించుకొని ఖమ్మం జిల్లాలో సుమారు 7 లక్షల ఎకరాలకు, నాగార్జునసాగర్ ఆయకట్టు మూడు లక్షల ఎకరాలకు మొత్తం పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించటమే నా యొక్క మరియు ప్రజల యొక్క కోరిక అని మంత్రి తెలిపారు.

ఇల్లందు నియోజకవర్గానికి కూడా గోళ్ళ పాడు నుంచి నీరు అందించడం సాధ్యం కాలేదని, అటవీ అనుమతులు లభించకపోవడం వలన సాధ్యపడలేదని తెలిపారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గోదావరి జలాలను ఇల్లందు నియోజకవర్గానికి తరలిస్తామని ఆయన అన్నారు. గోదావరి పై భాగంలో ఉన్నటువంటి ప్రగల్లపల్లి ఎత్తిపోతల పథకం ద్వారా భద్రాచలం నియోజకవర్గానికి తాలిపేరు ప్రాజెక్టు ఉన్నప్పటికీ దుమ్ముగూడెం మండలంలోని 30 వేల ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉన్నదని దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని తెలిపారు. దీని ద్వారా అన్ని నియోజకవర్గాలకు నియోజకవర్గానికి కొత్తగా లక్ష ఎకరాల చొప్పున సేద్యం లోనికి వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. తాగునీటి పథకానికి కూడా వైరా ప్రాజెక్టు, పాలేరు ప్రాజెక్టు ఉన్నందువల్ల సాగర్ నీరు రాకపోయినా గోదావరి జలాలతో త్రాగునీరు సాగునీరు ఆ గోదావరి తల్లి ద్వారా తీర్చుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇంజనీర్ పెద్దారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈనెల లోనే ఈ మూడు పంప్ హౌస్ ల ట్రయల్ రన్ పూర్తి చేస్తామని దీని కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న అధికారులను మంత్రి అభినందించారు.

ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ ఏ శ్రీనివాస్ రెడ్డి, సూపరిండెంట్ ఇంజనీర్ ఎస్ శ్రీనివాస్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కే సురేష్ కుమార్ ఇతర ఇంజనీరింగ్ విభాగపు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *